: ధోనీకి మద్దతిచ్చిన ఆస్ట్రేలియా దిగ్గజం డీన్ జోన్స్


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ మద్దతిచ్చాడు. ఒక్క మ్యాచ్ లో ఓడితే చాలు... ధోనీ స్థానంలో కోహ్లీని కెప్టెన్ ను చెయ్యాలనే డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ధోనీపై ఒత్తిడి నెలకొంటోంది. దీనిపై డీన్ జోన్స్ మాట్లాడుతూ, భారత క్రికెట్ జట్టును ఉన్నతస్థానంలో నిలపడంలో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక ముద్రను వేశాడన్నారు. ధోని ఒకసారి భారత క్రికెట్ నుంచి దూరమైతే, ఆలోటు పూడ్చలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్ కు చాలా సేవ చేసిన ధోనీ వీడ్కోలు నిర్ణయం అతనికే వదిలేస్తే బాగుంటుందన్నారు. ధోని కెప్టెన్సీపై ఒత్తిడి ఉండకూడదని చెప్పిన ఆయన, విరాట్ కోహ్లిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా చేసే సమయం ఇంకా రాలేదని భావిస్తున్నానని అన్నారు. ఏదోఒక రోజు ధోని క్రికెట్ కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుందని, అప్పటి వరకు ఎదురు చూడాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News