: నేనెక్కడున్నానో చెప్పగలరా?: సచిన్ టెండూల్కర్


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు ఒక తమాషా ప్రశ్న వేశాడు. అదీ కూడా ఒక క్యారికేచర్ ముందు నిలబడి పోజిచ్చిన సచిన్ దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నేంటో తెలుసుకోవాలంటే, ముందుగా ఆ క్యారికేచర్ గురించి తెలుసుకోవాలి. ఆ క్యారికేచర్ ఎవరిదో కాదు సచిన్ దే. దాని ముందు నవ్వుతూ నిలబడ్డ సచిన్ ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘నేనెక్కడున్నానో చెప్పగలరా???’ అంటూ ఆ ట్వీట్ లో ప్రశ్నించాడు. అయితే, ఈ ఫొటో ను సచిన్ ఎక్కడ దిగింది మాత్రం ప్రస్తావించలేదు.

  • Loading...

More Telugu News