: ఏటిగడ్డలో 48 గంటల దీక్షకు సిద్ధం: రేవంత్ రెడ్డి


మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పర్యటించాల్సిన బాధ్యత హరీష్ రావుకు లేదా? అని ప్రశ్నించారు. హరీష్ రావు ముంపు గ్రామాల్లో బాధితులకు న్యాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. ఇది సరికాదని ఆయన హితవు పలికారు. మల్లన్నసాగర్ లో ముంపుకు గురయ్యే 14 గ్రామాల బాధిత ప్రజలకు తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు. అవసరమైతే ఏటిగడ్డలో 48 గంటల నిరాహార దీక్షకు సిధ్ధమని ఆయన ప్రకటించారు. రైతుల సమస్యలు వింటామంటే తాము కూడా వస్తామని, ప్రభుత్వానికి సహకరిస్తామని, రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News