: ఏరువాకకు రైతులు రాకపోవడంతో వెనుదిరిగిన మహిళా ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా కంచికచర్లలో ఈరోజు ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమానికి రైతులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. రైతులు లేని ఏరువాక ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు. కాగా, ఏరువాక కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.