: సంగీతా ఛటర్జీకి మూడోసారి బెయిల్ పొడిగింపు


ఎర్రచందనం స్మగ్లర్, అందాల సుందరి కోల్ కతాలో పట్టుబడిన సంగీతా ఛటర్జీకి కోల్ కతా న్యాయస్థానం బెయిల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా బెయిల్ పొడిగింపుతో ఆమె మూడు సార్లు బెయిల్ ను పొడిగించుకోగలిగింది. ఆమెపై తీవ్ర అభియోగాలున్నాయి, ఆమె బెయిల్ ను రద్దు చేయండి, ఆమెను విచారించాలంటూ చిత్తూరు జిల్లా పోలీసులు కోల్ కతా న్యాయస్ధానంలో కేసు వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం నిందితురాలి న్యాయవాది వాదనతో ఏకీభవించి, బెయిల్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ సారి ఆమె బెయిల్ పొడిగించుకోకుండా పకడ్బందీగా పిటిషన్ దాఖలు చేసేందుకు చిత్తూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News