: గుట్టు చప్పుడు కాకుండా సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం...దేశ భద్రతపై భరోసా ఏంటి?


గుట్టుచప్పుడు కాకుండా భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి పక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతంగా ఉన్నాయి. ఇకపై రక్షణ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విమానయాన రంగంలో 100 ఎఫ్డీఐలను, ఫార్మా రంగంలో 74 శాతం ఎఫ్డీఐలను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. ఈ మూడు రంగాల్లో 51 శాతం ఒకేసారి పెంచుతూ ఎఫ్డీఐలను ఆహ్వానించడం దేశ చరిత్రలో ఇదే ప్రధమం. దీంతో భారత్ కు ఆయుధ కర్మాగారాలు క్యూకట్టే అవకాశం కనిపిస్తోంది. ఆయా కంపెనీలు చిన్న తరహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో అనధికార ఆయుధ తయరీదారులు కుటీర పరిశ్రమగా ఎదిగే ప్రమాదం పొంచి ఉంది. దీని కోసం మోదీ ప్రభుత్వం 1959లో తయారైన ఆయుధ చట్టానికి సవరణలు చేసింది. గతంలో రక్షణ రంగంలో ఎఫ్డీఐలకు అనుమతిస్తే...దేశ భద్రత పరిస్థితి ఏంటంటూ బీజేపీ తీవ్రస్థాయిలో యాగీ చేసింది. భారత్ ను మరో అమెరికాలా తయారు చేస్తారా? అంటూ బీజేపీ సీనియర్లు పలు సందర్భాల్లో మన్మోహన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గన్ కల్చర్ పెరిగిపోతుందని, రక్షణ రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని, ఆయుధ సరఫరా పేరుతో దేశాన్ని నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ బీజేపీ తీవ్ర స్థాయి విమర్శలు చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టిన రెండేళ్లకే రక్షణ రంగంలో 100 ఎఫ్డీఐలను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News