: ఆకివీడు బ్యాంకులో 2.6 కిలోల బంగారం మాయం!


పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. తాను తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు ఓ ఖాతాదారుడు వచ్చిన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు ఖాతాదారుడి బంగారంతో పాటు భారీ ఎత్తున బంగారం కనిపించడం లేదని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. బంగారం మాయమైనట్టు బ్యాంకు మేనేజర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాఫ్తు మొదలుపెట్టారు. మొత్తం 2.632 కిలోల బంగారం మాయమైనట్టు ఆయన తెలిపారు. ఈ ఉదంతం వెనుక బ్యాంకు సిబ్బంది పాత్ర కచ్చితంగా ఉండి వుండవచ్చని అనుమానిస్తూ, ఆ దిశగా విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News