: 200 వన్డేలాడిన 6వ సఫారీ ఆటగాడిగా డివిలియర్స్ రికార్డు


సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ కీర్తి కిరీటంలో మరో రికార్డు వచ్చి చేరింది. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న డివిలియర్స్...200 వన్డేలాడిన ఆరవ సఫారీ ఆటగాడిగా నిలిచాడు. 200వ వన్డే వర్షార్పణమైపోయినప్పటికీ సౌతాఫ్రికా తరపున 200 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ రికార్డును ఇంతకు ముందు జాంటీ రోడ్స్, మార్క్ బౌచర్, జాక్వస్ కలిస్, హెర్షెల్ గిబ్స్, షాన్ పొలాక్ లు మాత్రమే సాధించారు. రోడ్స్, కలిస్, పొలాక్, డివిలియర్స్ నలుగురూ ఆల్ రౌండర్స్ కావడం విశేషం. దీనిపై డివిలియర్స్ మాట్లాడుతూ, ఇది తనకు లభించిన అరుదైన గౌరవమని పేర్కొన్నాడు. కాగా, నిన్న జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయగా, అనంతరం సఫారీలు బ్యాటింగ్ కు దిగే సమయంలో ప్రారంభమైన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్ ఆగిపోయింది.

  • Loading...

More Telugu News