: దాదర్ రైల్వేస్టేషన్ లో బ్యాటరీ దొంగతనం... నిలిచిపోయిన రైళ్లు
ముంబయిలోని దాదర్ రైల్వేస్టేషన్ లో బ్యాటరీ బాక్స్ ను దొంగలెత్తుకుపోవడంతో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంఘటన ఈరోజు జరిగింది. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మహిన్ ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో బ్యాటరీ బాక్స్ దొంగతనానికి గురైందని పేర్కొంది. ఈ సమస్య కారణంగా ముంబయిలోని పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేశామన్నారు. అంధేరి-చర్చ్ గేట్ మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అంధేరి-వైరా సెక్షన్ లో దాదాపు అరగంట పాటు పలు రైలు సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు పేర్కొన్నారు. సమస్యను సరిదిద్ది తిరిగి రైలు సర్వీసులను ప్రారంభించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు సర్వీసులు నిలిచిపోవడంతో లక్షలాది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు సకాలంలో తమ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు.