: టీఆర్ఎస్ ది హోల్ సేల్ రాజకీయ వ్యభిచారం: చాడ వెంకట్ రెడ్డి
టీఆర్ఎస్ ది హోల్ సేల్ రాజకీయ వ్యభిచారమని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ టీఆర్ఎస్ లోకి వెళ్లడంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీలు మారిన వాళ్లు, చేరిన వాళ్ల లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం వెంటనే రద్దు చేయాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. ఈ మేరకు వెంటనే రాజ్యాంగ సవరణ తీసుకురావాలని కోరారు.