: ఆ వార్తలన్నీ పచ్చి అబద్ధాలు!... పార్టీ మారేది లేదన్న సునీతా లక్ష్మారెడ్డి!
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కొట్టిపారేశారు. సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే అధికారంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరదామంటూ కార్యకర్తలు పోరు పెడుతున్న నేపథ్యంలో సునీత కూడా డైలమాలో పడిపోయారని నేటి ఉదయం వార్తాకథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై సునీత వేగంగా స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆమె... తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆమె తేల్చిచెప్పారు. ఊపిరి ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీని వీడనని ఆమె స్పష్టం చేశారు.