: ప్రభుత్వ 'ప్రైవేటు' డాక్టర్లకు మూడు ఇంక్రిమెంట్లు కట్: బాబు సర్కారు కీలక నిర్ణయం
ప్రభుత్వ వైద్యులుగా ఉండి ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపై చంద్రబాబు సర్కారు కొరడా ఝుళిపించింది. వారికి మొదటి హెచ్చరికగా మూడు ఇంక్రిమెంట్లను కట్ చేస్తున్నట్టు మంత్రి కామినేని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వైద్యులు తమ వైఖరిని మార్చుకోకుంటే విధుల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల జీవో జారీ అయిందని, ప్రక్రియ ఆసాంతం ఆన్ లైన్ లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. 22వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించిన ఆయన, బదిలీలు కోరే ఉద్యోగులు ఉన్నతాధికారులను సంప్రదించరాదని ఆదేశించారు. ఎవరైనా ఆన్ లైన్లో దరఖాస్తు చేయాల్సిందేనని, పూర్తి పారదర్శకంగా బదిలీలు ఉంటాయని తెలిపారు.