: దేవినేని ఉమా కూడా పంచె కట్టేశారు!... ‘ఏరువాక’లో నాగలి పట్టి పొలం దున్నిన మంత్రి
ఏపీ ప్రభుత్వం నేటి ఉదయం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఏరువాక’ జోరుగా సాగుతోంది. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి తెర తీయగా, సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఆయన కేబినెట్ లోని మంత్రులంతా పొలంలోకి దిగేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గొల్లపూడి శివారులోని పంట పొలాల వద్ద జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పంచెకట్టులో దర్శనమిచ్చారు. తలకు పాగా చుట్టి పొలంలో కాలుమోపిన ఆయన నాగలి పట్టి పొలం దున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో ఏరువాకలో రైతులంతా భాగస్వాములు కావాలని దేవినేని పిలుపునిచ్చారు.