: హిందూ ఆలయంలో మైకులు వద్దంటున్న జమ్మూ ముస్లింలు... పూంచ్ ప్రాంతంలో ఉద్రిక్తత
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ ప్రాంతం పూంచ్ జిల్లాలోని ఓ గ్రామంలో మరో వివాదం తలెత్తింది. ఇక్కడికి సమీపంలోని ఝులాస్ గ్రామంలోని హిందూ దేవాలయంలో లౌడ్ స్పీకర్లను వాడవద్దని ముస్లింలు ఆదేశించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి దేవాలయ నిర్వహణ కమిటీ మైకులను వాడుతుండగా, వాటిని తొలగించేందుకు ఒక ముస్లిం మహిళ నేతృత్వంలో కొందరు యువకులు ప్రయత్నించారని, ఈ సమయంలో ఇరు వర్గాలూ ఎదురెదురుగా చేరి, వ్యతిరేక నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితి విషమించకుండా చర్యలు చేపట్టి, బందోబస్తు చేసినట్టు వివరించారు.