: ఆగిన అమరావతి రైతుల స్థలాల కేటాయింపు


చంద్రబాబు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావించిన రాజధాని అమరావతి నగర రైతుల ప్లాట్ల కేటాయింపు వాయిదా పడింది. అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు నేడు ప్లాట్లు కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎవరికి ఎక్కడ ప్లాట్ ఇస్తున్నదీ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, తుళ్లూరు ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం పడుతూ ఉండటంతో, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వర్షాలు తగ్గాక స్థలాల కేటాయింపు ఎప్పుడనేదీ ప్రకటిస్తామని తెలిపారు. కేవలం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అన్నారు. కాగా, తమకు నేడు ప్లాట్లు ఎక్కడో తెలుస్తుందని గంపెడాశతో ఉన్న రైతులు, నారాయణ ప్రకటనతో అసంతృప్తికి గురయ్యారు.

  • Loading...

More Telugu News