: ‘యోగా డే’ ఎఫెక్ట్!... ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన వాయిదా పడినట్టేనా?


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మంత్రాంగం ఫలించి... ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు మొన్న వెలువడిన సంగతి తెలిసిందే. విశాఖ కేంద్రంగా త్వరలోనే ఏర్పాటు కానున్న ఈ జోన్ కు ‘సౌత్ ఈస్ట్ కోస్ట్ డివిజన్’గా నామకరణం కూడా జరిగిపోయిందన్న వార్తలు వినిపించాయి. ఈ మేరకు రేపు (జూన్ 21) విశాఖ పర్యటనకు రానున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటిస్తారని, ప్రభు టూర్ షెడ్యూల్ కూడా ఖరారైందని సమాచారం. అయితే రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరిట విజయవాడలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమం ప్రభు టూర్ షెడ్యూల్ ను మార్చేసింది. రేపు విశాఖలో జరగనున్న తన పర్యటనను రద్దు చేసుకున్న ప్రభు... రేపు విజయవాడలో జరగనున్న యోగా డే వేడుకల్లో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన యోగాసనాలు వేస్తారట. దీంతో విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన వాయిదా పడిపోయిందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News