: వివిధ శాఖల్లో 63వేల పోస్టులు ఖాళీ
వివిధ ప్రభుత్వ శాఖలలో 63,621 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వివిధ శాఖలలోని ఖాళీలను గుర్తించిన సర్కార్ ఈ విషయాన్ని వెల్లడించంది. వాటిలో ఉపాధ్యాయ పోస్టులు 20,790, జూనియర్ అధ్యాపక పోస్టులు 4,898, పోలీస్ విభాగంలో 10,730, రెవెన్యూ విభాగంలో 6,095, ట్రాన్స్ కోలో 3,208, కుటుంబ సంక్షేమ శాఖలో 2,234, వ్యవసాయ శాఖలో 236, దేవాదాయ శాఖలో 180, సాధారణ పరిపాలన శాఖలో 104, పట్టణ ప్లానింగ్ విభాగంలో 288, రోడ్లు భవనాల శాఖలో 135, ఆర్ధిక శాఖలో 103 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటిని ప్రభుత్వం భర్తీ చేయవలసి ఉంది.