: ‘ఔటర్’పై ఘోర రోడ్డు ప్రమాదం!... పోలీసు వ్యాన్ పై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు ఖాకీలకు తీవ్ర గాయాలు


భాగ్యనగరిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు నగరానికి వచ్చేవారికి నేరుగా గమ్య స్థానానికి చేరేందుకంటూ నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు ఆలవాలంగా మారుతోంది. ఇప్పటికే ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోగా, అంతకు రెట్టింపు సంఖ్యలో గాయాలపాయ్యారు. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున ఈ రోడ్డుపై పెద్ద అంబర్ పేట వద్ద మరో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ లోడుతో వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ... అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు వాహనాన్ని చిదిమేసింది. ముందుగా వెళుతున్న పోలీస్ వ్యాన్ పై నుంచి లారీ వెళ్లడంతో పోలీసు వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో పోలీస్ వాహనంలోని కానిస్టేబుళ్లు వేణు గోపాల్, నాగేశ్వర్, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News