: సర్వం ‘యోగా’మయం!... రాందేవ్ బాబాతో కలిసి యోగాసనాలు వేసిన వెంకయ్య!


యోగాసనాలకు విశ్వవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. భారత్ లో విశేష ప్రచారం పొందిన యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన యత్నం వృథాగా పోలేదు. భారత్ కంటే అధికంగా ప్రపంచ దేశాలు యోగా బాట పట్టాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. రేపటికి (జూన్ 21... వరల్డ్ యోగా డే) యోగాకు అంతర్జాతీయ స్థాయి యోగం పట్టి రెండేళ్లు పూర్తవుతోంది. యోగా డే సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నిర్వహించిన కార్యక్రమానికి దాదాపు 35 వేల మంది హాజరయ్యారు. వీరిలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. స్వయంగా రాజ్ పథ్ వచ్చిన వెంకయ్య.... రాందేవ్ బాబాతో కలిసి యోగాసనాలు వేశారు. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రిహార్సల్స్ జరిగాయి.

  • Loading...

More Telugu News