: హైదరాబాద్ లో ఆక్టోపస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ బేగంపేటలోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో కానిస్టేబుల్ శివకుమార్ (25) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్ కు చెందిన శివకుమార్ ఈరోజు సాయంత్రం సెంట్రీ విధులకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని తోటి సిబ్బంది సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శివకుమార్ మృతదేహాన్ని ఆక్టోపస్ డీజీ గోవింద్ సింగ్ పరిశీలించారు. వ్యక్తిగత కారణాలే శివకుమార్ ఆత్మహత్యకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శివకుమార్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల.