: విశాఖలో టీడీపీ నేతపై బాంబులతో దాడి... తీవ్ర గాయాలు


విశాఖపట్టణం జిల్లాకు చెందిన టీడీపీ నేత సత్యనారాయణపై బాంబు దాడి జరిగింది. బుచ్చయ్యపేట మండలం గుంటికొర్లాం దగ్గర గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వడ్డాది ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్టణం తరలించే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా, సత్యనారాయణపై దాడికి కారణం రాజకీయాలా? లేక వ్యక్తిగత కక్షలా? అనేది తెలియాల్సి ఉంది. విశాఖ జిల్లాలో మొట్టమొదటిసారిగా నాటుబాంబులను ఉపయోగించి ఈ తరహా దాడులు జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News