: ఆ కుంభకోణంలో చంద్రబాబు, లోకేశ్ లకు సంబంధముంది: అంబటి రాంబాబు
అమరలింగేశ్వర స్వామి భూముల కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కొడుకు లోకేశ్ లకు సంబంధముంది కనుకనే అమరావతిలో వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. చెన్నై సదావర్తి సత్రం భూముల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, వాస్తవాలను పరిశీలించేందుకు వెళ్లిన కమిటీని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ నెల 26న చెన్నైలో ధర్మాన ప్రసాదరావు బృందం పర్యటించి, సదావర్తి సత్రం భూములపై వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.