: హృతిక్ రోషన్ మాజీ భార్యపై చీటింగ్ కేసు


ఒక రియల్ ఎస్టేట్ సంస్థను మోసం చేసిందనే ఆరోపణల కేసులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్ పై గోవాలో చీటింగ్ కేసు నమోదైంది. గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను తాను ఆర్కిటెక్ట్ గా పరిచయం చేసుకున్న సుసానే ఖాన్ తమ నుంచి ఒక కాంట్రాక్టు తీసుకుందని, దీని నిమిత్తం 2013లో ఆమెకు రూ.1.87 కోట్లు చెల్లించామని, ఆ కాంట్రాక్టును ఇప్పటివరకు పూర్తి చేయలేదని ఈ మేరకు ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు ఇవ్వాలని కోరగా సుసానే ఖాన్ తెలియజేయలేదని, ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News