: అమ్మాయిలు నన్ను పట్టించుకోవట్లేదు: హీరో నాగ శౌర్య


అమ్మాయిలు తనను పట్టించుకోవట్లేదని, బయటకు వెళ్లినప్పుడు తనను చూడట్లేదని యువహీరో నాగ శౌర్య అన్నాడు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కాఫీలు చాలా తక్కువ తాగుతాను. అయితే, ప్రతిరోజూ ఉదయం కాఫీ తాగుతాను. మా డాడీ నాకు బెడ్ కాఫీ తాగిస్తారు. సిక్స్ టు సిక్స్ వరకే నా ప్రొఫెషన్. ఆ తర్వాత నా పర్సనల్ లైఫ్. మూవీ ప్రమోషన్ తప్పా, ఆ సమయం తర్వాత ఎంతమంది పిలిచినా నేను ఎక్కడికి వెళ్లను. నా షూటింగ్ అయిపోతే, వెంటనే బెడ్ రూంలోకి వెళ్లిపోతాను. హిందీ సీరియల్స్ ఎక్కువగా చూస్తాను" అని చెప్పాడు నాగశౌర్య.

  • Loading...

More Telugu News