: భూమన వెనకున్న శక్తి కచ్చితంగా జగనే!: బుద్ధా వెంకన్న


హోం మంత్రి చినరాజప్పపై భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న విమర్శల వెనక ఉన్న రాజకీయ శక్తి కచ్చితంగా వైఎస్ జగనేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ప్రోద్బలంతోనే భూమన రెచ్చిపోతున్నారని ఆరోపించారు. హోం మంత్రిని చులకన చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. భూమన తన వైఖరిని మార్చుకోకుంటే, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను చేస్తున్న దీక్షను కాపుల సంక్షేమం కోసం కాకుండా తన రాజకీయ అవసరాల కోసం ముద్రగడ వాడుకుంటున్నారని వెంకన్న నిప్పులు చెరిగారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వున్నా కూడా, దీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మొత్తం దీక్ష నాటకమేనని, దీని వెనుక సూత్రధారి జగన్ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News