: ఏ హీరోయిన్ తోనూ ప్రేమాయణం లేదు: హీరో రానా


తనకు ఏ హీరోయిన్ తోనూ ప్రేమ వ్యవహారాలు లేవని హీరో దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూ ఇస్తూ, హీరోయిన్లతో తనకు ఉన్న అఫైర్లపై వచ్చిన వార్తలను ఖండించాడు. తాను నటుడిగా స్థిరపడిన తరువాత మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసిన రానా, తానిప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని, ప్రేమకు సమయం లేదని చెప్పాడు. 30వ పడిలో పడ్డ తాను, పెళ్లి గురించిన ఎలాంటి ఆలోచనలనూ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా, రానా ప్రస్తుతం 'బాహుబలి-2, ది కన్ క్లూజన్' క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News