: ఇంతకన్నా ముద్రగడను జైల్లో పెట్టి ఉన్నా బాగుండేది!: మాజీ ఎంపీ హర్షకుమార్
కాపుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా బాధిస్తోందని, అంతకన్నా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినా బాగుండేదని మాజీ ఎంపీ హర్షకుమార్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆయన దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ఆంక్షలు పెడుతోందని, ముద్రగడ పరిస్థితి జైల్లో కన్నా దారుణంగా ఉందని అన్నారు. చంద్రబాబు ఓ డిక్టేటర్ మాదిరిగా వ్యవహరిస్తూ, ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారని, ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. తుని విధ్వంసం ఘటనలో అమాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టిందని హర్షకుమార్ ఆరోపించారు.