: దేవుడి దయతోనే బతికాను: వికాస్ భన్సాడే


ప్రత్యర్థులు పెట్టిన బాంబు నుంచి దేవుడి దయతోనే తాను బతికానని సుప్రీంకోర్టు న్యాయవాది, నాలుగు రాష్ట్రాల గవర్నర్లకు న్యాయ సలహాదారుగా పనిచేసిన వికాస్ భన్సాడే వ్యాఖ్యానించారు. ఆయన్ను మచిలీపట్నంలో హత్య చేసేందుకు గుర్తు తెలియని దుండగులు కెమెరా ఫ్లాష్ బాంబును అమర్చగా, దాన్ని పోలీసులు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భన్సాడే స్పందిస్తూ, సొంత ఊరికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చిపోతూ ఉన్నానని, తనను హత్య చేస్తే, కలిగే లాభమేంటో తనకు తెలియదని చెప్పారు. తనకు గతంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారో, ఇప్పుడు ఎందుకు తీసేశారో తెలియదని అన్నారు. మచిలీపట్నం ప్రాంతంలో తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News