: తట్టా బుట్టా సర్దేసి, అమరావతికి పంపేస్తున్న వివిధ శాఖలు!


అమరావతికి తరలి వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లోని వివిధ శాఖల అధికారులు తమ తమ కార్యాలయాలకు సంబంధించిన సామాగ్రిని తరలించడం ప్రారంభించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లోని పాత మార్కెట్ ఆవరణలో వ్యవసాయ శాఖ కార్యాలయం ఈనెల 25న ప్రారంభం కానుండగా, హైదరాబాద్ లోని కార్యాలయ సామాను లారీల్లో తరలివచ్చింది. టేబుళ్లు, కుర్చీలు, ఏసీలు, వివిధ ఫైల్స్ తో ఉన్న బండిల్స్, ఫ్యాన్లు, ఇతర సామానును ఇక్కడికి చేర్చారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించనుండగా, పలువురు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, వ్యవసాయ శాఖతో పాటు మత్స్యశాఖ, రహదారులు, భవనాల శాఖ, ఆర్టీసీ కూడా తమ కార్యాలయాలకు సంబంధించిన తట్టా బుట్టా సర్ది అమరావతి ప్రాంతానికి ఇప్పటికే చేర్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News