: పులి చేతిలో బలైన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల సాయం
మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్ రిజర్వులో ఓ పులి 70 ఏళ్ల వృద్ధుడిపై దాడిచేసి చంపేసిన విషయం తెలిసిందే. బఫర్‌జోన్‌లోకి ప్రవేశించిన రాజా రామ్ అనే వ్యక్తిని పులి చంపేసింది. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద 10వేల రూపాయలు అందించినట్టు టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ జేఎస్ చౌహాన్ తెలిపారు. త్వరలో మరో 4 లక్షల రూపాయలను అందించనున్నట్టు పేర్కొన్నారు. ఏనుగుల సాయంతో పులిని రిజర్వు లోపలికి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.