: ఫెదరర్ కు షాకిచ్చిన అనామక టీనేజర్
హాలేలో జరుగుతున్న హాలే ఓపెన్ టెన్నిస్ పోటీల్లో ఎనిమిది సార్లు చాంపియన్ గా నిలిచిన రోజర్ ఫెదరర్ కు సెమీఫైనల్ పోరులో ఓ అనామక టీనేజర్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 34 సంవత్సరాల టెన్నిస్ దిగ్గజాన్ని, 19 ఏళ్ల జవ్ రేవ్ 7-6 (7/4), 5-7, 6-3 తేడాతో ఓడించి తన రెండో ఏటీపీ టూర్ ఫైనల్ కు చేరాడు. 17 సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలను గెలిచిన రోజర్, గత మూడు హాలే ఓపెన్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచాడు. తన తొలి గాలే టోర్నమెంటు ఆడుతున్న జవ్ రేవ్, పదునైన వ్యాలీలు, ఏస్ లతో ఫెదరర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. కాగా, ఫైనల్ లో జవ్ రేవ్, మయెర్ తో పోటీ పడనున్నాడు. ఈ విజయంతో జవ్ రేవ్ ఏటీపీ ర్యాంకు గణనీయంగా మెరుగుపడనుంది.