: ఆర్బీఐ గవర్నర్ రేసులో ఏడుగురు... అరుంధతీ భట్టాచార్య కూడా!


ఆర్బీఐ గవర్నర్ పదవి రేసులో ఏడుగురి పేర్లు వినిపిస్తున్నాయి. రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసేందుకు సుముఖంగా లేని రఘురామ్ రాజన్ స్థానాన్ని వీరిలో ఒకరితో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఏడుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. గవర్నర్ గిరీకి పోటీ పడుతున్న వారిలో విజయ్ కేల్కర్, రాకేష్ మోహన్, అశోక్ లాహిరి, ఉర్జిత్ పటేల్, అరుంధతి భట్టాచార్య, సుబిర్ గోకరన్, అకోశ్ చావ్లా ఉన్నారు. వీరిలో ఉర్జిత్ పటేల్, అరుంధతీ భట్టాచార్యల్లో ఒకరిని ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పటేల్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరిస్తుండగా భారత్‌లోనే అతిపెద్దదైన భారతీయ స్టేట్‌బ్యాంకు ఎండీగా అరుంధతీ భట్టాచార్య వ్యవహరిస్తున్నారు. మిగతా వారు ఆర్బీఐలో సీనియర్ అధికారులు.

  • Loading...

More Telugu News