: తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు
గడచిన రెండు వారాలుగా రైతులను ఊరిస్తున్న రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలపై పాక్షికంగా నైరుతీ రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కాగా, హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి ముసురు పట్టిన వాతావరణం ఉండగా, రాత్రి పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. ఇబ్రహీంపట్నం, వికారాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు తెలుస్తోంది.