: 'సామి' నిజంగా స్వామే!
డారెన్ సామి.. ఈ వెస్టిండీస్ క్రికెట్ జట్టు సారథి నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆపద్బాంధవుడిలా అవతరించాడు. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో 19 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టును సామి (41 బంతుల్లో 60) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. సామికి తోడు అమిత్ మిశ్రా (21) కూడా రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్ జేమ్స్ ఫాక్ నర్ ఐదు వికెట్లతో సన్ రైజర్స్ వెన్నువిరిచాడు.