: మోదీ ఇలాకాలో పాగా వేసేందుకు కేజ్రీవాల్ వ్యూహం


ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకాలో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2017లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని 'ఆప్' వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 8న కేజ్రీవాల్ రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లనున్నారని ఆప్ వెల్లడించింది. అక్కడ పార్టీ వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు. జూలై 9న గుజరాత్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో అధికారికంగా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News