: 26న తెలంగాణ వ్యాప్తంగా ఇఫ్తార్ విందు, దుస్తుల పంపిణీ
రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇఫ్తార్ విందు, దుస్తుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం, తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో సుమారు ఆరు వేల మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. దీంతో పాటు హైదరాబాదులోని 100 మసీదుల వద్ద, రాష్ట్రంలోని ఇత జిల్లాల్లో గల 95 నియోజకవర్గ కేంద్రాల్లోను కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సుమారు రెండు లక్షల పేద ముస్లిం కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేస్తారు.