: టీ హబ్ లో పారీకర్... సాదర స్వాగతం పలికిన కేటీఆర్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ హైదరాబాదు పర్యటన నేటి ఉదయం ప్రారంభమైంది. భారత వైమానిక దళంలోకి మహిళా ఫైటర్ పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ఆయన నేరుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీ హబ్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. టీ హబ్ లో పనిచేస్తున్న అధికారులను స్వయంగా కేంద్ర మంత్రికి పరిచయం చేసిన కేటీఆర్... టీ హబ్ ఉద్దేశాలను వివరించారు.