: రాష్ట్రపతి విడిది సమీపాన ప్రియాంకా గాంధీ నివాసమా?... అనుమతి రద్దు చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే


హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలోని చారబ్రాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా ఓ ఇల్లు కట్టుకుంటున్నారు. తన అభిరుచికి అనుగుణంగా ఆమె ప్రత్యేక శ్రద్ధతో ఆ ఇంటిని కట్టుకుంటున్నారు. ఈ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవలే పలుమార్లు తన తల్లి సోనియా గాంధీని వెంటబెట్టుకుని మరీ వెళ్లిన ప్రియాంకా... అక్కడ హాలిడేని కూడా ఎంజాయ్ చేశారు. ఈ ఇంటికి ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ సర్కారు అనుమతులు కూడా జారీ చేసింది. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని బీజేపీకి చెందిన ఆ రాష్ట్ర ఎమ్మెల్యే సురేశ్ భరద్వాజ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్రపతి వేసవి విడిది చారబ్రాకు సమీపంలోనే ఉంది. రాష్ట్రపతి వేసవి విడిదికి అత్యంత సమీపంలో ప్రియాంకా గాంధీ నివాసం ఉంటే భద్రతా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసిన భరద్వాజ్... ఆ ఇంటి అనుమతులను రద్దు చేయాలని ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు.

  • Loading...

More Telugu News