: సౌదీలో హింసకు గురైన మహిళకు జయలలిత 10 లక్షల ఆర్థిక సాయం


సౌదీ అరేబియాలో యజమాని చిత్రహింసలు భరించలేక తప్పించుకునేందుకు బాల్కనీ నుంచి దూకి తీవ్రంగా గాయపడి చెన్నై చేరిన దాక్షాయనికి ముఖ్యమంత్రి జయలలిత రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చెన్నైలోని తొండియర్ పేటకు చెందిన దాక్షాయని పొట్టకూటి కోసం సౌదీ వెళ్లింది. అక్కడ యజమాని ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతో భరించలేని ఆమె తప్పించుకుని ఇండియా వచ్చేందుకు బాల్కనీపై నుంచి దూకడంతో తీవ్రగాయాలపాలైంది. గురువారం చెన్నై చేరుకున్న ఆమెను అధికారులు వెంటనే స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న దాక్షాయని గాధ వింటుంటే గుండె తరుక్కుపోతోందని జయలలిత అన్నారు. ఆమె పేరుమీద 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం నుంచి ఆమెకు నెలకు వడ్డీ రూపంలో రూ.8,125 అందుతాయని తెలిపారు. ఆమెకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్ ను కోరారు. అలాగే సామాజిక సంక్షేమ, పౌష్టికాహార శాఖామంత్రి వి.సరోజ, కార్మికశాఖామంత్రి నిలోఫర్ ఖఫీల్ తదితరులను ఆస్పత్రికి వెళ్లి దాక్షాయని బాగోగులు చూసి రావాలని కోరారు.

  • Loading...

More Telugu News