: బ్యాడ్ వెదర్ ఎఫెక్ట్!... నెల్లూరు జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న చంద్రబాబు
నైరుతి రుతు పవనాల రాక ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. నాలుగు రోజులకు ముందే రాష్ట్రాన్ని తాకాల్సిన రుతు పవనాలు నిన్న రాత్రికి కళింగపట్నానికి చేరుకున్నాయి. ఆలస్యంగా కదులుతున్న రుతు పవనాల కారణంగా పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై వాతావరణ శాఖ కూడా పక్కాగా అంచనావేయలేకపోతోంది. ఈ క్రమంలో నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సీఎం టూర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ పర్యటన రద్దైనట్లు సీఎంఓ నుంచి ఓ ప్రకటన వెలువడింది. రుతు పవనాల ఎంట్రీతో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగానే ఈ పర్యటన రద్దైనట్లు ఆ ప్రకటనలో సీఎంఓ తెలిపింది.