: పరీక్షల్లో హ్యాపీగా మాస్ కాపీయింగ్... బీహార్లో మరో దారుణ సంఘటన!


బీహార్ లో విద్యావ్యవస్థ ఎంత దారుణమైన స్థితిలో ఉందో తాజాగా వెలుగు చూసిన టాపర్స్ స్కాం బయటపెట్టగా... అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి రావడం అక్కడ విద్యారంగం దుస్థితికి అద్దం పడుతోంది. పాట్నాలోని రోటాస్ కళాశాలలో తాజాగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు గుంపులు గుంపులుగా నేలపై కూర్చుని నిర్భీతిగా మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. కళాశాలలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో తరగతి గదుల్లో చీకటిగా ఉండడంతో ...సరదాగా కూర్చుని మొబైల్ లైట్ల వెలుగుల్లో పరీక్షలు రాశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటపడడంతో మళ్లీ కలకలం రేగింది.

  • Loading...

More Telugu News