: అసహనంతోనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు!: టీఆర్ఎస్ ఎంపీ కవిత


కాంగ్రెస్ నేతలు అసహనం, ఆవేదనతోనే విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నామన్న జైరాం రమేష్ వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం వల్ల బొక్కబోర్లా పడుతోందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ పరాజయం పాలవ్వడానికి కారణం అక్కడ సరైన నాయకులు లేకపోవడమేనని ఆమె చెప్పారు. దేశం మొత్తం నెంబర్ వన్ సీఎం అంటూ మెచ్చుకుంటున్న కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శిస్తున్నారని, పచ్చ కామెర్ల వాడికి లోకం పచ్చగా కనిపిస్తుందని ఆమె మండిపడ్డారు. సీఎం పరిపాలనా విధానం నచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, డీఎస్, గుత్తాలు టీఆర్ఎస్ లో చేరారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News