: ఆస్టిన్ వేదికగా గోదావరి ప్రథమ వార్షికోత్సవం
ఆస్టిన్, టెక్సార్, యూఎస్ఏ, జూన్ 16 2016: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న సౌత్ ఇండియన్ ఫుడ్ చైన్ గోదావరి తన పదో శాఖను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో ఏర్పాటుచేసేందుకు సన్నద్ధం అయింది. గోదావరి రెస్టారెంట్ చైన్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆత్మీయ సౌత్ ఇండియన్ రుచులను అందించేందుకు గత ఏడాది బోస్టన్‌లో ప్రారంభమైన గోదావరి తన విస్తరణలో భాగంగా ఆస్టిన్, శాన్ ఆంటానియోల్లో కొలువుదీరేందుకు సిద్ధమయింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి ఫౌండేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూఎస్‌లో దినదినాభివృద్ధి చెందుతున్న గోదావరి ఆస్టిన్‌లో ఈ వారాంతంలో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే తొమ్మిది కేంద్రాల ద్వారా చెవులూరించే వంటకాలను అందిస్తున్న గోదావరి తన వార్షికోత్సవం సందర్భంగా ఆస్టిన్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించుకుంటోంది. టెక్సాస్ రాష్ట్రంలో ఇది రెండో రెస్టారెంట్. గోదావరి ఆస్టిన్ అత్యంత కీలకమైన కేంద్రంలో కొలువు దీరి ఉంది. ఆపిల్, డెల్, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలకు కొద్ది మైళ్ల దూరంలోనే ఉంది. టీం గోదావరి ఈ సందర్భంగా విశిష్టమైన ‘పంచె కట్టు’ భావనతో మెగా లంచ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వడ్డించే వారు సైతం దక్షిణ భారతదేశ సంప్రదాయమైన పంచె, లంగాఓణిలతో వడ్డిస్తారు. ఈ సందర్భంగా బఫెట్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెంది అమ్మమ్మ, తాతమ్మలు పంపించిన బ్రాండ్ న్యూ అథెంటిక్ వంటకాలతో వడ్డించనుంది. ఇందులో కొన్ని ‘భీమవరం బోండా’, ‘కిన్నెరసాని అప్పడం బజ్జి’, ‘మంగమ్మగారి మాంసం పప్పుచారు’, ‘అవకాయ్ కొరమీను పులుసు’, ‘రాయుడు గారి రాగి సంకటి’, ‘నాటుకోడి గుడ్డు పులావ్’ వంటివి మొట్టమొదటిసారి అమెరికాలో ప్రవేశపెడుతున్నారు. ఇంతేకాకుండా గోదావరి ఆస్టిన్ ప్రత్యేకంగా వంటకాలు చేరవేసేందుకు ‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ను ప్రవేశపెట్టింది. ఆస్టిన్‌లోని ఆరు కాలనీల్లో ఉన్న పార్టీ ఆహుతులకు వంటకాలను చేరవేసేందుకు, ఆస్టిన్, శాన్ ఆంటోనియో ప్రాంతాల్లో లైవ్ కాటరింగ్ సదుపాయం కల్పించేందుకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి గ్రూప్ కో ఫౌండర్ తేజా చేకూరి మాట్లాడుతూ ఈ విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. ‘టెక్సాస్ రాష్ట్రంలో గోదావరి రెస్టారెంట్ ఏర్పాటుచేసి భారతీయ రుచులను అందజేయడం ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా బోస్టన్ నుంచి ప్రారంభమైన మా ప్రయాణానికి ఈ వేడుక అద్దం పడుతుంది’ అని హర్షం వ్యక్తం చేశారు. వెల్లూరు ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ ) నుంచి కౌశిక్ కోగంటి యంగ్ అలుమ్నీ అచీవర్ అవార్డును పొందారు. ఈ సందర్భంగా ఆయన ఉత్సాహభరిత ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ వీడియో స్పీచ్ లింక్ ఇది. https://www.youtube.com/watch?v=WUd83xKvoHw గోదావరి ఆస్టిన్ వ్యవహారాల బాధ్యుడు వేణు పెద్దు, శ్రీనివాస్ గొండి & రాజశేఖర్ రెడ్డి పాశం ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రాబోయే కొద్దిమాసల్లో మా నూతన రెస్టారెంట్‌ను శాన్ ఆంటోనియోలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతున్నాం. టీం గోదావరి ప్రారంభం నుంచి భాగస్వామ్యం అవడం పట్ల, గోదావరి ఫ్యామిలీలో పాలుపంచుకోవడం సంతోషకరంగా ఉంది. గోదావరి డల్లాస్, బోస్టన్, చికాగోల్లో గత కొద్ది నెలల్లో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీనటులు హాజరై మా వంటకాలను ఆస్వాదించారు.అమెరికా అంతటా గోదావరి ద్వారా ఆత్మీయ వంటకాలు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు’ అని తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తేనా) బోస్టన్‌లో నిర్వహించిన భారీ వేడుకకు గోదావరి ఆత్మీయ భోజనాలు అందించింది. ఈ సేవల ద్వారా అతిథుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ప్రారంభం కానున్న గోదావరి ఫౌండేషన్ యంగ్ & డైనమిక్ టీం ద్వారా క్రియాశీలంగా ముందుకుసాగనుంది. “స్వల్పకాలంలోనే గోదావరి భారీ విజయం సాధించడం వెనక భారతీయ వంటకాల సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటాలనే యంగ్ & డైనమిక్ టీం తపన ఉంది’’ అని గోదావరి ఆస్టిన్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. గోదావరి వారసత్వం ఆస్టిన్, శాన్ ఆంటారియోల్లో సైతం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసింది. భోజన ప్రియులందరినీ గోదావరి సాదరంగా ఆహ్వానిస్తోంది. మీకు ఆత్మీయ ఆతిథ్యం అందించేందుకు ఎదురుచూస్తూ.... గోదావరి ఆస్టిన్, 1779 వెల్స్ బ్రాంచ్ పీకేడబ్ల్యూవై ఆస్టిన్, టెక్సాస్ 78728. ఫోన్ః 512-903-0638 మరోమారు మా ఆత్మీయ అతిథులైన మీకు కృతజ్ఞతలు సంప్రదించండి: వేణుమాధవ్ పెద్దు Email Me: AUSTIN@GODAVARIUS.COM ఫోన్: 269-779-5889 www.GodavariUS.com Press note released by: Indian Clicks, LLC