: 10 మందికి బెయిల్ వచ్చింది...దీక్ష విరమించండి: ముద్రగడతో కలెక్టర్, ఎస్పీ


తుని ఘటనలో అరెస్టయిన పది మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ తునిలో గత జనవరి 31న కాపు గర్జన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విధ్వంసం చోటుచేసుకుంది. ఇందులో ప్రమేయం ఉందంటూ 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకాగా, కోర్టు వారికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ ఉద్యమ ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితుల్లో 10 మందికి ఇప్పుడు బెయిల్ లభించినందున, నిరాహార దీక్ష విరమించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ ముద్రగడకు సూచించారు.

  • Loading...

More Telugu News