: మరో ట్విస్ట్.. బురిడీ బాబా కాజేసిన సొమ్ముని మాకివ్వండి: ఐటీ అధికారులు
లైఫ్ స్టయిల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డి వద్ద బురిడీ బాబా శివ కాజేసిన సొమ్మును తమకి అప్పగించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కోరారు. ఈ విషయమై వారు కొద్ది సేపటి క్రితం బంజారాహిల్స్ పోలీసులని కలిశారు. లైఫ్ స్టయిల్ భవన యజమాని తమకు 22.33 కోట్ల రూపాయల ట్యాక్స్ బకాయి ఉన్నాడని ఐటీ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బంజారా హిల్స్ పోలీసులు ఈ విషయమై పై అధికారులను కలవాలని ఐటీ అధికారులకు సూచించారు. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని ముధుసూదన్ రెడ్డి వద్ద పూజల పేరుతో నాటకం ఆడి బురిడీ బాబా శివ కోటీ 30 లక్షల రూపాయలు కొట్టేసి అనంతరం బెంగళూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ బృందానికి చిక్కిన సంగతి తెలిసిందే.