: కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ల జాతకం ఇక విద్యార్థుల చేతుల్లో!
తమ వద్ద చదువుకునే విద్యార్థులకు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు పరీక్షలు పెట్టి వారి నైపుణ్యానికి మార్కులు వేస్తారన్న సంగతి తెలిసిందే. ఇక కేరళలోని కొచ్చి యూనివర్శిటీ ప్రొఫెసర్లకు విద్యార్థులతో మార్కులు వేయించి, తక్కువ మార్కులు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది. చదువు ముగించుకుని వెళ్లే విద్యార్థుల నుంచి ప్రొఫెసర్ల పనితీరు ఎలా ఉంది? పాఠాలు ఎలా చెప్పారు? తరగతి గదిలో వాతావరణం బాగుందా? వారు తమ సబ్జెక్టులో నైపుణ్యవంతులేనా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోనుంది. 2013లో యూజీసీ జారీ చేసిన ఆదేశాల మేరకు, కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని యాజమాన్యం చెబుతుండగా, ప్రొఫెసర్ల సంఘాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.