: వీణ-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా వైద్యుల సానుకూల స్పందన
అవిభక్త కవలలు వీణ-వాణిల ఆపరేషన్‌కు ఆస్ట్రేలియా వైద్యులు సుముఖత వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పర్యటిస్తోన్న తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అక్కడి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీణ-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సుముఖత వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు గతంలో తాము చేసిన శస్త్రచికిత్సలను గురించి నిరంజన్ రెడ్డికి వివరించారు. రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) వైద్యులతో వీణ-వాణిలకు ఆపరేషన్ చేయించే అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు.