: జీవితఖైదు పడ్డ మూడు సింహాల్లో రెండు బాలనేరస్తులట... ప్రొబేషన్ లో వదిలేశారు!


గుజరాత్ అభయారణ్యాల్లో మ్యానీటర్లుగా మారి ముగ్గురు మనుషులను చంపి తిన్న సింహాల్లో మూడింటికి జీవితఖైదు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు బాల నేరస్తులని, ఓ మగ సింహం మనిషిని చంపి తినగా మిగిలిన మాంసాన్ని మాత్రమే తిన్నాయని నిర్ణయించిన అటవీ శాఖ అధికారులు, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి అడవిలో వదిలేశారు. ఈ రెండింటినీ ఒకదానిని ఒకటి కలవకుండా దూరంగా ఉంచి కొంతకాలం అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు. ఈ రెండింటి ముఖంపై వెంట్రుకలు తక్కువగా కనిపించాయని తెలిపారు. కాగా, గత మూడు నెలల వ్యవధిలో అంబార్ది ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసిన సింహాలు ముగ్గురిని హతమార్చగా, కేసు పెట్టిన పోలీసులు 17 సింహాలను అదుపులోకి తీసుకుని, విచారించి మూడింటిని మాత్రమే దోషులుగా తేల్చిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News