: రాజకీయ లబ్ధి కోసం రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయి: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో చేపడుతోన్న ప్రాజెక్టులతో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించడం లేదంటూ ప్రతిపక్షాలు కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. మల్లన్న సాగర్ రైతులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. బీడు భూములకు నీళ్లు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చెయ్యొద్దని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.