: ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం


తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింద‌ని, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. కోస్తాలో రుతు ప‌వ‌నాలు వ్యాపించాయని, మ‌రో రెండు రోజుల్లో రాయ‌ల‌సీమ‌, తెలంగాణ‌కు విస్త‌రించ‌నున్నాయని పేర్కొంది. దీంతో ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావరణ శాఖ చెప్పింది. కొస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో ప‌లు చోట్ల భారీ వర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News